శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ ‘యూ టర్న్’ 2016లో విడుదలై బ్లాక్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రమే తెలుగు సమంత హీరోయిన్ గా “యూ టర్న్” టైటిల్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ థ్రిల్లర్ మూవీని పవన్ కుమార్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమిళం, బెంగాలీ భాషల్లో కూడా రీమేక్ చేయగా అక్కడా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ రీమేక్ కు సిద్ధమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నూతన దర్శకుడు ఆరిఫ్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ‘యూ టర్న్’ రీమేక్ కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. “జవానీ జానెమాన్”తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అలయ ఎఫ్ ప్రస్తుతం “యూ టర్న్” హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఖరారైంది. రేపే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Read Also : ‘ఫేవరెట్ టీం’ అంటూ వాళ్ళతో మెహ్రీన్… పిక్ వైరల్
ఇక మూవీ కథ విషయానికొస్తే… ఒక ఫ్లైఓవర్ పై వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. ఆ మరణాలపై దర్యాప్తు చేసే ఓ యువ రిపోర్టర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులు మాత్రమే అక్కడ మృత్యువాత పడుతున్నారన్న విషయాన్ని గుర్తిస్తుంది. అయితే దానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆమెకు దిగ్భ్రాంతికర విషయాలు తెలుస్తాయి. సినిమాలో ఉండే ట్విస్ట్ లు ప్రేక్షకులను బాగా థ్రిల్ చేస్తాయి. సౌత్ లో దాదాపు అన్ని భాషల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
