సినిమా తెరపై యాక్షన్ స్టంట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, ఉత్సాహం కలుగుతాయి. ఒక్కసారి కళ్లు చెదిరే స్టంట్ సన్నివేశాలు పెద్ద తెరపై అలరిస్తాయి. కానీ, ఈ అద్భుతమైన స్టంట్ల వెనుక స్టంట్‌మ్యాన్‌లు పడే శ్రమ, ఎదుర్కొనే ప్రమాదం గురించి ఎవరూ ఆలోచించరు. ఇటీవల, తమిళ దర్శకుడు పా రంజిత్ సినిమా సెట్‌లో స్టంట్‌మ్యాన్ రాజు దురదృష్టవశాత్తూ మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన స్టంట్‌మ్యాన్‌ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Also Read: War 2: ట్రైలర్ తో దుల్లకొట్టేందుకు రెడీ!
సినిమా పరిశ్రమలో స్టంట్‌లు చేయడం అనేది అత్యంత సాహసోపేతమైన, అంతే ప్రమాదకరమైన పని. అక్షయ్ కుమార్, తన సినిమాల్లో చాలా వరకు స్టంట్‌లను స్వయంగా చేస్తాడు. బాడీ డబుల్‌ను ఉపయోగించడం చాలా అరుదైన విషయం. తమిళ స్టంట్‌మ్యాన్ రాజు మరణం తర్వాత, అక్షయ్ దేశవ్యాప్తంగా స్టంట్‌మ్యాన్‌లకు బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ దహియా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే
విక్రమ్ సింగ్ దహియా మాట్లాడుతూ, అక్షయ్ కుమార్ ఎప్పటి నుంచో స్టంట్‌మ్యాన్‌ల భద్రత, వారి బీమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. బాలీవుడ్ సెట్‌లు గతంలో కంటే ఇప్పుడు స్టంట్‌ల కోసం చాలా సురక్షితంగా మారాయని, అయినప్పటికీ స్టంట్‌లు చేయడం ఎంతో ప్రమాదకరమని ఆయన అన్నారు. స్టంట్‌లు ఎంత జాగ్రత్తగా చేసినా ప్రమాదకరమేనని ఆయన చెప్పారు. రాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన విక్రమ్ సింగ్, దక్షిణాది సినిమా సెట్‌లతో పోలిస్తే బాలీవుడ్‌లో స్టంట్‌మ్యాన్‌ల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ దాదాపు 650-700 మంది స్టంట్‌మ్యాన్‌లకు బీమా సౌకర్యం కల్పించారని, ఇందులో ఆరోగ్య బీమాతో పాటు ప్రమాద బీమా కూడా ఉందని తెలిపారు. స్టంట్‌మ్యాన్ సెట్‌లో లేదా బయట గాయపడితే, రూ. 5-5.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. అకస్మాత్తుగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 20-25 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ బీమా విధానాన్ని అక్షయ్ కుమార్ సొంత నిధులతో ప్రారంభించి, నిర్వహణలో కూడా సహాయం చేస్తున్నారని విక్రమ్ సింగ్ ప్రశంసించారు.
