Site icon NTV Telugu

Akshay Kumar : అక్షయ్ బర్త్ డేకి.. అభిమానులకు మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్

Akshai Kumar

Akshai Kumar

బాలీవుడ్‌లో ఖిలాడీగా పేరుగాంచిన అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. 1987 లో వచ్చిన ‘ఆజ్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 38 ఏళ్లపాటు సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ వంటి అనేక విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

Also Read : Teja Sajja : ఈ ఇద్దరు స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా డ్రీమ్: తేజా సజ్జా

అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఆయన తన సమకాలికుల్లో ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసిన హీరో. ఇతర స్టార్‌లు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటే, అక్షయ్ మాత్రం వరుసగా మూడో నాలుగు సినిమాలు చేయడం అలవాటు. ఈ వేగమే ఆయనను రికార్డు స్థాయిలో ముందుకు నడిపించింది. ఫలితంగా తక్కువ కాలంలోనే 200వ సినిమాకు చేరుకునే ఘనత సాధించారు. కాగా అక్షయ్ కుమార్ పుట్టినరోజు సెప్టెంబర్ 9. ఈ స్పెషల్ డేను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అభిమానులకు మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదేంటంటే ఆయన 200వ సినిమాను ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ సందర్భం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ 200వ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో ఉంటుందో, ఏ జానర్‌లో తెరకెక్కుతుందో అన్న వివరాలు అప్పుడే ప్రకటించనున్నారని సమాచారం. అక్షయ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి కాబట్టి అభిమానులు, ఇండస్ట్రీ అంతా ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే, అక్షయ్ కుమార్ నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ సిరీస్‌కి ఉన్న పాపులారిటీ కారణంగా ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, అక్షయ్ కుమార్ పుట్టినరోజు అభిమానులకు నిజంగానే పండుగలా మారనుంది. 200వ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు, ఇప్పటికే రాబోయే జాలీ ఎల్‌ఎల్‌బీ 3తో ఆయన తన జోష్‌ను మరింత రెట్టింపు చేయబోతున్నారు.

Exit mobile version