Site icon NTV Telugu

Akkineni Nagarjuna : తమిళనాడు పోలీసులు చేయలేనిది తెలంగాణా పోలీసులు చేసి చూపించారు.. హ్యాట్సఫ్

Akkineni

Akkineni

హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో టాలీవుడ్ సినీ  ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు భేటీ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు. రవి నుండి కీలక సమాచారాన్ని సేకరించి మరికొన్ని పైరసీ వెబ్‌సైట్స్ కు అడ్డుకట్ట వేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు సినిమా పెద్దలు. అనంతర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : IFFI 2025 : సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలయ్యలకు ఘన సన్మానం

నాగార్జున మాట్లాడుతూ ‘ తెలంగాణ పోలీస్ శాఖ వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ బొమ్మ రవి అరెస్ట్ అవగానే చెన్నై నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఇక్కడ మేము చేయలేని పని మీ తెలంగాణ పోలీస్ చేశారని గర్వంగా చెప్పాడు. ఐ బొమ్మ రవి 50 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ చేశాడు. వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాడు. 6 నెలల క్రితం మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని 2 రోజులపాటు డిజిటల్ అరెస్ట్ లో పెట్టారు. ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చాం. వారు మా వాళ్ళని కాపాడారు. డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చుని ఉచితంగా సినిమా చూస్తున్నాం అని మాత్రం అనుకోకండి. మీ డేటా చోరీ అవుతుంది అనేది గుర్తుంచుకోండి. మీకు తెలియకుండా మీ పర్సనల్ డేటా మొత్తాన్ని పైరసీ కేటుగాళ్లు సేకరిస్తున్నారు. ఇండస్ట్రీని ఈ పైరసీ భూతం నుండి కాపాడిన తెలంగాణ పోలీసులకు, సీపీ సజ్జనార్ కు ధన్యవాదాలు’ అని అన్నారు.

Exit mobile version