అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ముగింపు మహోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మురళీమోహన్ కు ‘అక్కినేని స్మారక పురస్కారం’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుచేతుల మీదుగా మురళిమోహన్ కు అందజేశారు. అనంతరం మురళీమోహన్ అక్కినేని కుటుంబంపై ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పలు కామెంట్స్ చేసారు.
నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ ‘తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణం. ప్రజాపతినిధి స్థానంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, తెలియకుండా రాజకీయ అటెన్షన్ కోసం ఏదిపడితే అనకూడదు అని సూచనలు చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పై నాగార్జున కోర్టు లో కేసు వేశారు. సోషల్ మీడియా వారు దయచేసి సినిమా వాళ్లపై అసత్య ప్రచారాలు చేయకండి. మంత్రి అక్కినేని కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని సినీ రంగం మొత్తం ఖండించింది.సోషల్ మీడియా లో సినీ నటులు పై తప్పుడు ప్రచారం చేస్తే ఇక నుండి ఉపేక్షించేది లేదు. అక్కినేని స్మారక పురస్కారం అందుకోవడం ఆస్కార్ అవార్డు సాధించినంత అనందంగా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయితే విశాఖ చరిత్ర మారిపోతుంది’ అని అన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖ సినీరంగానికి కేంద్రంగా మారాలి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి సినిమా ఇండస్ట్రీకి నా పూర్తీ సహకారం అందిస్తాను. ప్రతిభ ఉన్న కళాకారులకు సరైన మార్గాలు లేక పైకి వెళ్లలేకపోతున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖ లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి’ అని కోరారు.