NTV Telugu Site icon

Chay – Sobhita : ప్రేమ జంట పరిణయానికి డేట్ ఫిక్స్..?

Chay Shobita

Chay Shobita

అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కాగా ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ తేదీని నిశ్చయించినట్టు తెలుస్తోంది.

Also Read : Ram : అబ్బాయ్ ‘నందమూరి రామ్’ కు బాబాయ్ ల బెస్ట్ విషెస్

ఇటీవల వైజాగ్ లోని శోభిత నివాసంలో పెళ్లి పనులను కూడా స్టార్ట్ చేసారు. అందుకు సంబంధించి ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది శోభిత. అయితే అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే దగ్గర బందువులకు ఈ విషయమై సమాచారం ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అక్కినేని కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. అందుకోసం లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డం తో ఉన్నాడు చైతన్య. పెళ్లి నాటికి ఈ సినిమా షూట్ ముగించి సినిమాలకు కాస్త విరామం తీసుకునివైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. అక్కినేని వారి ఇంట జరగబోయే ఈ గ్రాండ్ వివాహ కార్యక్రమానికి సంబంధించి ఈ పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ లా వేరే దేశంలో ఎక్కడైనా చేస్తారా లేదా హైదరాబాద్ లోనే నిర్వహిస్తారా అనేది త్వరలో ప్రకటించనున్నారు అక్కినేని నాగార్జున.

Show comments