NTV Telugu Site icon

Akkineni Akhil : ఎయిర్ పోర్టులో కొత్త జంట..

Akhil

Akhil

నిండు నూరేళ్ళ జీవితం గడపాలి అంటే అదృష్టం ఉండాలి. ఎలాంటి బంధం అయిన చిన్న కలహాలు వస్తే సర్దుకోవాలి తప్ప  తెగే వరకు లాగకూడదు. ఆ బ్రేకప్ అనేది కుటుంబాని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ దీనికి నిదర్శనం. నాగార్జున మొదటి భార్య ని వదిలేసి అమలని పెళ్లి చేసుకున్నాడు. చైతన్య సమంత ని వదిలేసి, శోభితను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా ముందు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకుని తనతో విడిపోయి ఇప్పుడు ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అయినప్పటికి ప్రజంట్ చై ఇంకా నాగార్జున హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక పోతే అఖిల్ పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. వీలైనంత తొంద‌ర‌ల‌నే ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్కనున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా అఖిల్, జైనాబ్ ఇద్దరూ జంటగా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్ పోర్టులో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఎంతో అన్యోన్యంగా కనిపించారు..

Also Read: Court : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన..!

ఇక ఈ జంటను చూసిన నెటిజన్స్ చాలా చూడ‌ముచ్చట‌గా ఉన్నారు.. అంటూ. పెళ్లి పనుల‌లో వారు బిజీగా ఉన్నారేమో అని, మరికొందరు కాబోయే భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం టూర్ వేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు కావడంతో స్పెషల్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకే ఇద్దరు అలా మంచి ప్లేస్‌కి వెళుతున్నారేమో. అంతే కాదు ఇదే అఖిల్ లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే పార్టీ అని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.