Site icon NTV Telugu

Lenin: అఖిల్ ‘లెనిన్’లో సర్ప్రైజ్ గెస్ట్ రోల్ – సీనియర్ హీరోతో పవర్‌ఫుల్ క్లైమాక్స్

Akhil Lenin

Akhil Lenin

హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ల అయినప్పటికీ ఒక్క హిట్ కొట్టలేకపోయారు అక్కినేని యంగ్ హీరో అఖిల్. మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా విమర్శలు  ఎదురుకున్నారు. అయితే, ఈ విమర్శలను పక్కన పెట్టి, అఖిల్ ఈసారి గ్యాప్ తీసుకుని పక్కా మాస్, మసాలా కథని ఎంచుకొని ‘లెనిన్’ తో బాక్సాఫీస్‌ను దున్నేయాలని నిర్ణయించుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతుంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి.

Also Read : Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..

ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ఈ సినిమాలో అఖిల్ తండ్రిగా అక్కినేని నాగార్జున నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాత్రకు నాగార్జున సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా 80% పూర్తి అవ్వగా , చివరి షెడ్యూల్ మాత్రమే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండనుందట. ఈ పాత్రలో ఒక సీనియర్ హీరో కనిపిస్తాడని.. క్లైమాక్స్ మొత్తం పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ సీనియర్ హీరో ఎవరు అనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Exit mobile version