Site icon NTV Telugu

Akhil Akkineni: మరో సినిమాకి అయ్యగారి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

Akhil Akkineni

Akhil Akkineni

Akhil Akkineni to Do a Periodic Movie in Annapurna Banner: అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయలేదు. ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతాడని అనుకున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతానికి అఖిల్ మేకోవర్ కూడా అవుతున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే అక్కినేని అఖిల్ తదుపరి సినిమాకి కూడా స్క్రిప్టు లాక్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ అనే ఒక సినిమాతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్

కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని గీత 2 బ్యానర్ నిర్మించింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు మురళీ కిషోర్ చెప్పిన కథకు అక్కినేని కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కథ బాగా నచ్చడంతో అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సినిమా కంటే ముందు ఉంటుందా? తర్వాత ఉంటుందా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.

Exit mobile version