Site icon NTV Telugu

Akhil Akkineni : కొండా సురేఖను వదిలే ప్రసక్తి లేదు..

Akhil Konda

Akhil Konda

అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై ఎంపీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. స‌మంత‌, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమ‌ల‌, ఎన్‌టీఆర్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైత‌న్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు కొండా సురేఖను గౌరవప్రదమైన స్తానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెల్సుకోవాలని హెచ్చరించారు. కాగా నాగార్జున భార్య అక్కినేని అమల కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు, సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని సూచించారు.

Also Read : Prabhas : ప్రభాస్‌ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పలేం : దగ్గుబాటి సురేష్

తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లపై స్పందించారు నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్. కొండా సురేఖ మాట్లాడిన మాటలు చాలా అసభ్యకరంగా, జుగుప్సాకరంగా, దారుణంగా ఉన్నాయి. మంత్రిగా, ప్రజా సేవకురాలిగా, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతిక బాధ్యతను మరచిపోయారు. ఆమె ప్రవర్తించిన తీరు సమాజానికి సిగ్గుచేటు, అలాగే క్షమించరానిది. ఆమె కారణంగా మేము అవమానింపడ్డాం. రాజకీయ యుద్ధంలో గెలవడానికి కొండా సురేఖ మాపై నిందలు వేసి మమ్మల్ని బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి. మన సమాజంలో ఉండే హక్కు లేదు. ఆమెలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదు. ఇది క్షమించరాని తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్.

 

Exit mobile version