Site icon NTV Telugu

Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!

Akhanda

Akhanda

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ‌-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?

కాగా ఈ సినిమా ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు కౌండౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. రెండు రోజుల క్రితం అఖండ టైటిల్ సాంగ్ ను ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో సెకండ్ సింగిల్ రిలీజ్ కు సంబంధించి డేట్ ఫిక్స్ చేసారు. జాజికాయ జాజికాయ అని సాగే సెకండ్ సింగిల్ ను ఈ మంగళవారం సాయంత్రంలో వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేయనున్నారు. బాలయ్య, సంయుక్త మీనన్ లపై వచ్చే ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవనుందట. మరోవైపు అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది టీమ్. ఈ వేడుకను ఆంధ్రలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో రాబోతున్న అఖండ 2ను 3D ఫార్మాట్ లోను తీసుకువస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న అఖండ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version