నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ తాండవం’ రిలీజ్‌కు సంబంధించి తాజాగా ఒక శుభవార్త వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టు కేసు కారణంగా డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం, సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమా వాయిదా పడినప్పటి నుంచీ, ‘అఖండ తాండవం’ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. మొదట డిసెంబర్ 12, 18, 25 లేదా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
Also Read : Krithi Shetty: హోటల్ రూమ్‌లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి
నిన్నటివరకు డిసెంబర్ 25వ తేదీని రిలీజ్ డేట్‌గా ప్రచారం చేశారు. అయితే, ఒక డిస్ట్రిబ్యూటర్ వెర్షన్ ప్రకారం, కోర్టు కేసు వ్యవహారం సానుకూలంగా ముగిసే దిశగా ఉందని తెలుస్తోంది. బుధవారం నాటికే కోర్టు ఆర్డర్ మేకర్స్ చేతికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కోర్టు నుంచి అనుకూలమైన ఆర్డర్ రాగానే, సినిమాను వెంటనే విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, డిస్ట్రిబ్యూటర్లకు డిసెంబర్ 12న రిలీజ్ (డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్లకు) సిద్ధంగా ఉండమని మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read :Dhurandhar : రన్ టైమ్ సమస్య కాదు.. కనెక్ట్ అవ్వడమే పాయింట్!
‘అఖండ తాండవం’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 వీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.
కోర్టు ఆర్డర్ అందిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలయ్య అభిమానులు ఈ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
