Site icon NTV Telugu

Akhanda 2 : బాలయ్య కెరీర్ హయ్యెస్ట్.. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్

Bali

Bali

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం పేరుతో అఖండ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. అంతకు ముందు ఒక రోజు ప్రీమియర్స్ ప్రదర్శించారు. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి డే వన్ కలెక్షన్స్ బాలకృష్ణ కెరీర్‌లోనే హైయెస్ట్‌గా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read :The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!

ఈ రెండూ కలిపి 59.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అఖండ తాండవం సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. వాస్తవానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. అది కాక, నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సినిమాగా ముందుకు దూసుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమాకి ఓటీటీ హక్కులు కూడా గట్టిగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది.

Exit mobile version