Site icon NTV Telugu

Akhanda 2 : అఖండలో బోయపాటి కొడుకుల పాత్రలివే

Boyapati Sreenu Sons

Boyapati Sreenu Sons

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్ అందిస్తూ తన తండ్రి బోయపాటికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సహాయం చేసినట్లు తెలుస్తోంది.

Also Read :Akhanda 2 : అఖండ2 నిర్మాతలకు బిగ్ రిలీఫ్

అంతేకాక, బోయపాటి చిన్న కుమారుడు వర్షిత్ ఈ సినిమాలో ప్రహ్లాదుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో ఒకటైన బాలమురళీకృష్ణ ఎంట్రీ సమయంలో ఈ ప్రహ్లాదుడి పాత్ర కనిపిస్తుంది. అలా అఖండ తాండవం సినిమాలో బోయపాటి పెద్ద కుమారుడితో పాటు చిన్న కుమారుడు కూడా భాగం అవ్వడం విశేషం. ఇక అఖండ తాండవం సినిమా ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ప్రారంభమైంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది.

Exit mobile version