Akhanda 2 : అఖండ 2 ఈవెంట్.. కూకట్పల్లి వైపు వెళ్లే వాళ్ళు జాగ్రత్త !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం (నవంబర్ 28, 2025) కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 28, 2025 శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్, కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా జనసమ్మర్దం, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించేందుకు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈవెంట్ సమయంలో కైతలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని ప్రకటనలో వెల్లడించారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు (సా. 4 నుండి రా. 11 గంటల వరకు)
ప్రయాణికులు గమనించవలసిన మళ్లింపు మార్గాలు ఈ విధంగా ఉన్నాయి:
మూసాపేట్ వైపు నుండి వచ్చే వాహనాలు: భరత్‌నగర్, ఎర్రగడ్డ నుంచి GHMC ఆఫీస్ వైపు మూసాపేట్ ద్వారా వచ్చే వాహనాలను కూకట్‌పల్లి Y జంక్షన్‌కు మళ్లిస్తారు.
కూకట్‌పల్లి Y జంక్షన్ వైపు నుండి వచ్చే వాహనాలు: కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి IDL లేక్ వైపు వెళ్లే వాహనాలను JNTU మార్గానికి మళ్లిస్తారు. (అశోకా వన్ మాల్ వద్ద మళ్లింపు ఉంటుంది).
మాదాపూర్, హైటెక్ సిటీ వైపు నుండి వచ్చే వాహనాలు: మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను నెక్సస్ మాల్, JNTU రోడ్ వైపు మళ్లిస్తారు. (యశోద హాస్పిటల్, మాదాపూర్ వద్ద మళ్లింపు ఉంటుంది).
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!