Site icon NTV Telugu

Akhanda2 : అఖండ 2 వాయిదా.. రెమ్యునరేషన్ వదులుకున్న బాలయ్య – బోయపాటి..

Akhanda 2 (3)

Akhanda 2 (3)

బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Also Read : Akhanda2 : అఖండ – 2 ఫైనాన్స్ ఇష్యూ క్లియర్.. కానీ

సినిమా రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చి నిర్మాతలకు అండగా నిలబడ్డారు. రెమ్యునరేషన్ లో భాగంగా బాలయ్యకు నిర్మాతలు ఇంకా రూ. 7 కోట్లు పెండింగ్ ఉన్నారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకు రూ. 4 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడడంతో బాలయ్య – బోయపాటి ఇద్దరు నిర్మాతలకు సాయంగా తమ రెమ్యునరేషన్ ను వదులుకున్నారు. అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొంతవరకు హామీగా ఉన్నట్టు సమాచారం. ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ కు అన్ని అడ్డంకులు తొలగడంతో 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈ రోజు మద్రాస్ హైకోర్టుకు అప్పీల్ కు వెళ్తున్నారు. అఖండ 2 రిలీజ్ కు తమకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. తీర్పు ఎలా వస్తుందోనని ట్రేడ్ వర్గాలు, ఫ్యాన్స్, థియేటర్ యాజమాన్యాలు ఉత్కంఠగా చూస్తున్నాయి.

Exit mobile version