Site icon NTV Telugu

Akhanda 2: ‘అఖండ 2’కు కోర్టులో బిగ్ షాక్: ప్రీమియర్ షోకి ముందు జీవో సస్పెండ్!

Akhanda Primiers

Akhanda Primiers

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల తేదీ విషయంలో అనేక వాయిదాల తర్వాత రేపు రిలీజ్ కానుంది. అయితే, మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు.

Also Read :Akhanda 2: అఖండ 2’కి లాస్ట్ మినిట్ షాక్..శ్రీశైలంలో బోయపాటి, తమన్

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇవాళ (తేదీ) ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC), మరియు సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వ జీవో సస్పెండ్‌తో, తెలంగాణాలో ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలు ఉంటాయా ఉండవా, టికెట్ ధరల పెంపు వ్యవహారంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు.

Exit mobile version