హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Akhanda2 : అఖండ 2.. హైందవం సాంగ్.. నందమూరి తమన్ అని అనేది ఇందుకే
మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న అఖండ 2 సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని U/A సర్టిఫికెట్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే సెన్సార్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ లో బాలయ్య ఎంట్రీ ఓ రేంజ్ లో సెట్ చేశాడట బోయపాటి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఆడియెన్స్ కు హై ఇస్తుందట. అలాగే అఘోర క్యారక్టర్ ఎంటర్ అయ్యాక సినిమా స్కెల్ మారిపోతుందట. ఇక ఇంటర్వెల్ ఎపిపోడ్ దాదాపు 20 నినిమిషాలు శివ తాండవమే అని సమాచారం. ఇక సెకండాఫ్ ఊహించిన దానికి మించి ఉండబోతుందట. హిమాలయాలలో వచ్చే సీన్స్, మహాకుంభ మేళ ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉంటాయని సమాచారం. బాలయ్య యాక్షన్ కు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉందని థియేటర్స్ లో గూస్ బమ్స్ గ్యాంరేంటి అని తెలిసింది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఇచ్చే హై ఫీల్ తో ఆడియెన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నారని టాక్. సో ఈ లెక్కన బాలయ్య బోయ కాంబో మరో సంచలనానికి రెడీ అవుతోంది.
