NTV Telugu Site icon

Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. ఎవరంటే..?

Untitled Design (27)

Untitled Design (27)

మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసిన పెళ్ళిళ్ళు, నిశ్చితార్దాల ఒకటే హడావిడి. ఈ పెళ్లిళ్లు హడావిడి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఇటీవల అక్కినేని వారసుడు నాగ చైతన్య, శోబితా దూళిపాళ్లల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. త్వరలో మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట బోతున్నారు ఈ జంట. ఇక మరో యంగ్ జోడి కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఒక్కటయ్యారు.

Also Read: Thandel : భారీ బడ్జెట్ ఓకే.. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు బన్నీ వాసు..?

తాజగా ఓ యంగ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆ భామ మరెవరో కాదు మెగా ఆకాష్. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ లు పరిచయమయింది మెగా ఆకాష్. ఆ సినిమా అంతగా ఆకట్టు కోలేదు. రెండవ సినిమాగా వచ్చిన చల్ మోహన్ రంగా కూడా ఫ్లాప్ గా మిగిలింది. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తే రాజా రాజా చోర ఒక్కటే హిట్. అటు కోలీవుడ్ లోను ఒకటి అరా హిట్స్ తో సాగుతుంది అమ్ముడు కెరీర్. కాగా మెగా ఆకాష్ తన ప్రియుడుతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు నిశ్చయించుకుంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న మెగా ఆకాష్ ఈ గురువారం అనగా ఆగస్టు 22న ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘నా కల నిజమైంది. ( ‘Engaged to the love of my life) అని ఫోటోలను షేర్ చేసింది.పెళ్లి ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ భామ నటించిన తమిళ చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉంది

Show comments