Site icon NTV Telugu

అజిత్ ఇంట్లో బాంబు… అసలు విషయం తేల్చిన పోలీసులు…!

Ajith Receives a fake bomb Threat Call

తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే అసలు విషయం ఏంటో తేల్చేశారు పోలీసులు. మే 31 న తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లుగా అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అజిత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ చేసి అదొక భూటకపు కాల్ గా గుర్తించారు. ఆ నెంబర్ ను ట్రేస్ చేయగా… అది దినేష్ అనే మానసిక వికలాంగుడి కాల్ అని పోలీసులకు తెలిసింది. అజిత్ ఇంజంబక్కం ఇంటికి నకిలీ బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. కాగా గత సంవత్సరం సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్ లకు ఇలాంటి కాల్స్ చేసినది దినేష్ అని నివేదికలు సూచిస్తున్నాయి. తల్లిదండ్రులను హెచ్చరించడానికి పోలీసులు దినేష్ ఇంటికి వెళ్లారు. అంతకుముందు పోలీసు అధికారులు దినేష్ కు మొబైల్ ఫోన్ ఇవ్వవద్దని వారి కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. అతను మళ్ళీ ఏదో విధంగా దినేష్ ఫోన్ పట్టుకుని పోలీసు కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు. దీంతో దినేష్ కుటుంబ సభ్యులను మరోసారి పోలీసులు హెచ్చరించారు. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే… అజిత్ నెక్స్ట్ మూవీ “వాలిమై” చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో స్పెయిన్లో చిత్రీకరించబడే ఫైట్ సీక్వెన్స్ మినహా మేకర్స్ ఈ చిత్రంలో ఎక్కువ భాగం పూర్తయ్యింది.

Exit mobile version