NTV Telugu Site icon

AK : సమ్మర్ కు మైత్రీ మూవీస్ సినిమా వాయిదా..?

Ak

Ak

మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

Also Read : Sivakarthikeyan : అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

కాగా సినిమాను మైత్రి నిర్మాతలు 2025 పొంగల్ కురిలిజ్ చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా షూటింగ్ చక చక చేస్తోంది యూనిట్. తాజా సమాచారం ప్రకారం పొంగుల్ రేస్ నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకుంది. అజిత్ కుమార్ మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విదాముయార్చి అనే సినిమా కూడా  చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల 2024 చివరిలో లేదా 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు అజిత్ సుముఖంగా లేడని అందుకోసమే రెండు రిలీజ్‌ల మధ్య గ్యాప్ మెయింటెయిన్ చేసేందుకు గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ విదాముయార్చి సంక్రాంతికి   విడుదలైతే, మైత్రీ మూవీస్ నిర్మించే  గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు నెలల గ్యాప్ తర్వాత  వచ్చే ఏడాది సమ్మర్  లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అవుతుంది.

Show comments