Site icon NTV Telugu

Ajith : తృటిలో తప్పిన ప్రమాదం – రేస్‌కు దూరమైన అజిత్

Ajith Racing Accident 2025

Ajith Racing Accident 2025

సినిమాల్లో నటుడిగా, కార్ రేసింగ్‌లో రియల్ హీరోగా తల అజిత్ తనదైన సత్తా చాటుతున్నాడు. ట్రాక్ పై అత‌డు చేసే విన్యాసాలు అభిమానుల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 50 ఏళ్లు దాటిన అతని డ్రైవింగ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ అదే స్పీడ్ ఎన్నో సార్లు అతడిని ప్రమాదాలకు గురి చేసింది. ప్రపంచ స్థాయిలో రేసింగ్ వేదికలపై దూసుకెళ్తున్న అజిత్ తాజాగా ఇటలీలోని మిసానో ట్రాక్‌లో ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. ‘జీటీ4 యూరోపియన్ సిరీస్’ రెండో రేస్ సందర్భంగా ట్రాక్‌పై నిలిచిన కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. గాయాలేమీ కాకపోయినా, రేస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

Also Read : 8 Vasanthalu OTT: ఓటీటీలో ధూసుకుపోతున్న ‘8 వసంతాలు’..

ప్రస్తుతం అజిత్ బెల్జియంలోని ప్రఖ్యాత ‘స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్’ సర్క్యూట్‌లో మూడవ రౌండ్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్లీనింగ్ సిబ్బందికి సహాయం చేయడం ద్వారా అజిత్ తన వినయాన్ని మళ్లీ చూపించారు. 2003లో రేసింగ్‌లోకి అడుగుపెట్టిన అజిత్, 2010లో ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లోనూ మెరిశాడు. జర్మనీ, మలేషియా లాంటి దేశాల్లో పలు పోటీల్లో పాల్గొంటూ, సినిమాలు, రేసింగ్ రెండింటికీ సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇటీవల ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణం. తెరపై హీరో అయిన తల అజిత్ రియల్ లైఫ్‌లోనూ అదే స్పీడ్ కొనసాగిస్తున్నాడు.

Exit mobile version