Site icon NTV Telugu

Ajith : అజిత్‎కుమార్‌కు మరోసారి తప్పిన కారు ప్రమాదం..

Ajith Kumar

Ajith Kumar

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల విషయం పక్కన పెడితే, ఆయన తరచూ రేసింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. ఇటీవలే బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్‌లో అజిత్ పాల్గొన్నారు. అయితే ఈ రేసులో అజిత్ కారు నియంత్రణ కోల్పోయి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది.

Also Read: Surya : తండ్రి మాటలకు ఎమోషనల్ అయిన సూర్య..

అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడడం అందరినీ ఊపిరిపీల్చుకునేలా చేసింది. గతంలో కూడా అజిత్ కార్ రేసింగ్ ట్రాక్ పై ప్రమాదానికి గురి కాగా ఇది మూడోసారి. అంతకముందు దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కూడా అదృష్టవశాత్తు అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగిన మరో రేస్‌లో పక్కనే వస్తున్న మరో కారును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఇందులో కూడా అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇతర కారు వల్ల ప్రమాదం జరిగిందట. ఇక ఇప్పుడు మూడో సారి జరిగిన ఈ ప్రయాదంకి వీడియోను ఆయన టీమ్ స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది.

Exit mobile version