Site icon NTV Telugu

125 కోట్లు… చిన్నతెరపై అజయ్ కు పెద్ద రెమ్యూనరేషన్!

వెబ్ సిరీస్ ఇప్పుడు వినోద రంగంలో సరికొత్త బజ్ వర్డ్ అయిపోయింది. చిన్నా పెద్దా నటులు అందరూ వెబ్ సిరీస్ ల పై దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ లో అయితే మరింత జోరుగా సాగుతోంది ఓటీటీ సీజన్. పదే పదే లాక్ డౌన్ లు, థియేటర్లు మూతపడుతుండటాలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి క్రేజ్ పెంచుతున్నాయి. అంతే కాదు, వెబ్ సిరీస్ ల రూపంలో సినిమాలకన్నా సీరియస్ కంటెంట్ అందించే చాన్స్ లభిస్తుండటంతో యాక్టింగ్ సత్తా ఉన్న నటులు, ప్రతిభ ఉన్న దర్శకులు ఇద్దరూ ఉత్సాహం చూపుతున్నారు. ఆ క్రమంలోనే బీ-టౌన్ సీనియర్ టాలెంటెడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా వెబ్ సిరీస్ కు సై అన్నాడు. పైగా అది బీబీసీ సంస్థతో కలసి చేస్తుండటంతో జనాల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఇప్పుడు సదరు రీమేక్ కాప్ థ్రిల్లర్ లో నటిస్తున్నందుకు అజయ్ తీసుకుంటోన్న భారీ రెమ్యూనరేషన్ కూడా చర్చగా మారింది…

Read More: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు!

‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ లో అజయ్ దేవగణ్ నటించబోతున్నాడు. బ్రిటన్ లో ఇప్పటికే ప్రసారమై విజయవంతం అయిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ‘లూథర్’… హిందీలోకి రీమేక్ అవుతోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలసి బీబీసీ ‘రుద్ర’ సిరీస్ నిర్మిస్తోంది. ఫీమేల్ లీడ్ గా ఇలియాన నటించనుందని చెబుతోన్న లిమిటెడ్ ఎపిసోడ్ వెబ్ సిరీస్ కోసం అజయ్ దేవగణ్‌ భారీగా ఫీజు తీసుకున్నాడట.125 కోట్లు ఆయనకు ఆఫర్ చేశారని ముంబై టాక్!
రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ స్వీకరించిన అజయ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటాడని తెలుస్తోంది. తన సొషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టులు పెట్టటం, రియాల్టీ షోస్ లో పాల్గొని వెబ్ సిరీస్ ని జనాల్లోకి తీసుకెళ్లటం, మీడియా ఇంటర్వ్యూస్, ప్రోమోస్ వగైరా వగైరా అన్నీ ఉంటాయట. చూస్తుంటే బాలీవుడ్ బడా స్టార్స్ వెబ్ సిరీస్ బిజినెస్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముందు ముందు బిగ్ స్క్రీన్ సినిమాలతో సమానంగా స్మార్ట్ స్క్రీన్ సిరీస్ లు సెన్సేషన్ సృష్టిస్తాయనుకుంటా!

Exit mobile version