NTV Telugu Site icon

Aishwarya Rajesh: నన్ను ఆడిషన్ అడిగితే షాక్ అయ్యా!!

Aishwarya 1

Aishwarya 1

ఒకప్పటి నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఆమె తర్వాత తెలుగులోకి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ సరసన చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో తాను ఈ సినిమాలో ఎలా భాగమయ్యాను అనే విషయం గురించి ఆమె వెల్లడించింది. తాను తమిళంలో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశానని, ఆ షూటింగ్లో ఉండగా అనిల్ రావిపూడి ఫోన్ చేసినట్లు వెల్లడించారు. తాను అనిల్ రావిపూడిని మాట్లాడుతున్నాను అంటే తనకి ఆయన పేరు తెలియదని చెప్పుకొచ్చింది.

Mohan Babu: గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

ఆయన చేసిన సినిమాలు చూశాను కానీ ఆయన పేరు అనిల్ రావిపూడి అనే విషయం నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి మేము ఇలా ఒక సినిమా ప్లాన్ చేసాము మీరు దానికి లుక్ టెస్ట్, ఆడిషన్స్ చేయాలి అంటే మీరు నేను చేసిన తమిళ సినిమాలు చూశారా? దాదాపు 40 కి పైగా సినిమాలు చేశానని ఆయనతో అన్నాను. దానికి ఆయన అలా కాదమ్మా మీరు మంచి నటి. ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ సినిమాల్లో లుక్ చాలా కీలకము కాబట్టి మీకు ఆ లుక్ సెట్ అవుతుందో లేదో ఒకసారి చూడాలనుకుంటున్నానని అన్నారు. వెంటనే నేను సరే వస్తాను అని చెప్పాను. తర్వాత ఆయన గురించి గూగుల్ చేస్తే అయ్యో ఆయన పేరు తెలుసుకోలేకపోయానే అనే బాధ కలిగింది అని ఆమె చెప్పారు. అలా తనను ఆడిషన్ చేయమని అడిగితే తనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇలా సడన్గా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కాల్ వచ్చి ఆడిషన్ అడిగితే దానికి షాక్ అయ్యానని ఆమె అన్నారు.

Show comments