సంక్రాంతి పండుగకు నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ . విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ఈ మూవీలో, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా. రిలీజ్ అయిన మొదటి షో నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించి, తొలి తెలుగు రీజినల్ హిట్‌గా చరిత్రలో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పాత్ర ఎంపిక పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన ప్రకారం ..
Also Read : Don 3 : డాన్ 3 హీరోయిన్ కృతి కాదు కియారానే.. క్లారిటీ ఇచ్చిన యూనిట్!
‘నలుగురు పిల్లల తల్లిగా నటించేందుకు నా వయసు సరిపోదని భావించవచ్చు. అయినా సరే, అలాంటి పాత్రలు వస్తే నేను వెనకడుగు వేయను. నటి అయిన తర్వాత పాత్రలో పూర్తిగా లీనమవడం ముఖ్యం. పాత్రకు వయసుతో సంబంధం లేదు’ అని తెలుపగా.. ఇంతలోనే ఒక వేల ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్ వస్తే, నీకు అప్పుడు ఆరుగురు పిల్లలు ఉంటారని, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాగా.. ‘అయినా నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ బదులిచ్చింది ఐశ్వర్య. అయితే ఐశ్వర్య ఈ వ్యాఖ్యలతో కొంతమంది ఫ్యాన్స్ కు హర్ట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమెను గ్లామర్ రోల్స్‌లో చూడాలని ఆశించే అభిమానులకు, ఈ విధమైన పాత్రలు నిరాశ కలిగించొచ్చని భావిస్తున్నారు. అయినా ఆమె చెప్పిన మాటలతో తను ఓ కమిట్మెంట్ ఉన్న నటి అనే విషయాన్ని మాత్రం మరోసారి నిరూపించేసింది.
