Site icon NTV Telugu

Garuda 2.0: ఓటీటీలోకి వెంకీ మామ హీరోయిన్ కొత్త సినిమా

Garuda

Garuda

హనుమాన్ మీడియా బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ గతంలో సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు తమిళంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగులో గరుడ 2.0 పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?
అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్తా హీరో, హీరోయిన్‌లుగా నటించారు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో గరుడ 2.0గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Varsham : ప్రభాస్ ‘వర్షం’ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..?
”ఆహా ఓటీటీ బృందం గరుడ 2.0 చిత్రాన్ని చూసి, సినిమా అద్భుతంగా ఉందని భావించి వెంటనే దీనిని తమ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంద”ని నిర్మాత బాలు చరణ్ అన్నారు.

Exit mobile version