Site icon NTV Telugu

Aishwarya Rajesh : హిట్ పడిన కూడా.. ఐశ్వర్య రాజేష్‌ను పట్టించుకోరేంటీ..?

Aishwarya Rajesh

Aishwarya Rajesh

టాలెంట్ ఉన్నప్పటికి కొంతమంది హీరోయిన్స్‌కి ఎందుకో పెద్దగా లక్ కలిసి రావడం లేదు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. తెలుగు అమ్మాయి అయినప్పటికి ఈ భామ తమిళ్‌లో పుట్టి పెరగడం వల్ల అక్కడ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు హీరోయిన్‌లకు టాలీవుడ్‌లో అవకాశాలు అందని ద్రాక్షగా మారిపోయాయి. తాజాగా ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీతో బారీ హిట్ అందుకున్నప్పటికి ఐశ్వర్య రాజేష్‌ ని ఎవ్వరు పటించుకోడంలేదు. ఇన్నాళ్లు తెలుగులో సక్సెస్ లేదు కాబట్టి అవకాశాలు రాలేదు అనుకోవచ్చు.. కానీ

Also Read : Thug Life : ఓటిటి రిలీజ్ కోసం దిగొచ్చిన ‘థగ్ లైఫ్’ ..?

స్టార్ హీరో వెంకీ మామ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక కూడా, అవకాశం రాకపోవడం షాకింగ్ గానే ఉంది. కానీ ప్రస్తుతం తమిళంలో 3 సినిమాలు చేస్తుంది ఐశ్వర్య. అందులో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటితో పాటు అమ్మడు ఓ కన్నడ సినిమా చేస్తుంది. నిజానికి ఆమెకు తెలుగులో సినిమాలు చేయాలని ఉన్న సరైన ఛాన్స్‌లు మాత్రం రావట్లేదు. టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నా.. బయటి వారిని హీరోయిన్‌లుగా తీసుకుంటున్నారు కానీ, ఇలాంటి తెలుగు హీరోయిన్‌లను మాత్రం పట్టించుకోవడం లేదు.

Exit mobile version