Aishwarya Rai : తన మార్ఫింగ్, ఏఐ వీడియోలపై.. కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ అందాల రాణి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, ఇమేజ్‌లను వాడకుండా తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : The Bads of Bollywood : ఆర్యన్ ఖాన్ తొలి వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో ఏంట్రీ ఇచ్చిన రాజమౌళి
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి కోర్టుకు వివరాలు అందజేశారు. కొంతమంది వ్యక్తులు, సంస్థలు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి, కృత్రిమ మేధస్సు (AI) తో ఎడిట్ చేసి, అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా ఆమె ఫొటోలను టీ షర్ట్‌లపై ముద్రించి వ్యాపారం కూడా చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరూ ఇలా చేయలేరని, ఇది ప్రైవసీ హక్కుల ఉల్లంఘన అని వాదించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు 2026 జనవరి 15కి వాయిదా వేసింది.
ఇక ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి వచ్చిన తప్పుడు ప్రచారాలపై కోర్టును ఆశ్రయించారు. ఆమె అనారోగ్యంతో ఉందని, “ఇక లేరు” అంటూ కొందరు యూట్యూబ్ ఛానళ్లలో నకిలీ వార్తలు రావడంతో ఆ సమయంలో కూడా ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల ఆరోగ్యం, ప్రైవసీ వంటి విషయాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని కోర్టు ఖండిస్తూ సంబంధిత కంటెంట్ తొలగించమని ఆదేశించింది. ఐశ్వర్య తాజా పిటిషన్ మరోసారి సెలబ్రిటీల ప్రైవసీ, ఇమేజ్ హక్కుల రక్షణపై చర్చకు దారితీసింది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు సూచించడంతో, సినీ ప్రముఖుల హక్కుల పరిరక్షణకు ఇది ఒక ప్రాముఖ్యమైన నిర్ణయంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..