NTV Telugu Site icon

Aishwarya Rai : ఐశ్వర్యరాయ్ కారుని ఢీకొట్టిన బ‌స్సు..!

Bollywood,abhishek Bachchan,aishwarya (8)

Bollywood,abhishek Bachchan,aishwarya (8)

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకో వార్త వింటున్నాం.. ప్రజలకు నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువ రోడ్డు ప్రమాదాలతో హాస్పటల్‌లో చేరుతున్నారు. ఇటివల సోనూసూద్ సతీమణి సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా, అదృష్టవ‌శాత్తు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంద‌న్న వార్త ఒక్కసారిగా హడలెత్తించింది.

ఐష్ కారును ఓ బస్సు ఢీ కొట్టినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదృష్టవ‌శాత్తు ఈ ప్రమాదంలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇంతకి ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో ఎవ‌రెవ‌రు ఉన్నారు, ఐశ్వర్యరాయ్ ఉందా అనే దానికి సంబంధించి వివ‌రాలు బ‌య‌ట‌కి రాలేదు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జుహు లోని, ఐశ్వర్య నివాసం సమీపంలో జరిగిందట. అయితే కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సు కారును ఢీకొట్టిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ప్రమాదం త‌ర్వాత కారుని అక్కడే వ‌దిలేసి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్త విని భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.