Site icon NTV Telugu

AIR: ఇంట్రెస్టింగ్‌గా ‘ఏఐఆర్‌’ ట్రైలర్ రిలీజ్..

Air Web Series Trailer

Air Web Series Trailer

విద్యార్థుల జీవితం గురించి ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ రూపొందిన వెబ్ సిరీస్ ‘ఏఐఆర్‌ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో హర్ష రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ వంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించగా, దీనికి సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ జూలై 3వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ వేడుకలలో.. హీరోయిన్ ప్రీతి మిస్.. కారణం ఇదేనా?

ఇక తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి మరో ట్రైలర్‌ను విడుదల చేశారు మెకర్స్. ఇది పదో తరగతి అనంతరం ఇంటర్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థులపై, వారి తల్లిదండ్రులు చూపించే అతి ఆశ లతో పాటు, ఆల్ ఇండియా ర్యాంకులు సాధించాలని చేసే ఒత్తిడి, మానసిక భారాన్ని ఈ సిరీస్ చక్కగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమ కలల కోసం పరుగులు చేయాల్సిన విద్యార్థులు.. మరోవైపు తల్లిదండ్రుల కలలను నెరవేర్చేందుకు చదువు పేరుతో పడే మానసిక కష్టాలు.. క్లిష్టమైన దశల్లో వారు తీసుకునే నిర్ణయాలు.. ఈ వెబ్‌సిరీస్ ప్రధాన థీమ్‌గా నిలుస్తున్నాయి. చదువులో ర్యాంకులు మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వం, మనోభావాలు కూడా ఈ సిరీస్ లో స్పష్టంగా చూపించబోతున్నారు. మొత్తానికి, అక్కడక్కడ ఫ‌న్నీగా సాగుతూ.. లోతైన సందేశాన్ని ఇచ్చేలా ఉన్న ‘ఏఐఆర్’ ట్రైలర్‌ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి సిరీస్‌ను చూసే ఆసక్తిని కలిగిస్తోంది. జూలై 3న ఈ సిరీస్ ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి..!

 

Exit mobile version