టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్- ఇండియా యాక్షన్ డ్రామా ’డెకాయిట్’. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ ‘డెకాయిట్’ కు కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఇక
Also Read : Pawan Kalyan : వీరమల్లు నుంచి ‘తారా తారా’ సాంగ్‌కు డేట్ టూ టైం ఫిక్స్..
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.. కాగా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్ లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్ ని చూస్తూ కనిపించినట్టుగానే ఈ ఫైర్ గ్లింప్స్ లో రివిల్ చేశారు. చాలా ఇంట్రస్టింగ్‌గా ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా గ్లింప్స్ బాగా కట్ చేశారు. వినపడుతునన్న సమాచారం ప్రకారం ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’.. వారు తమ జీవితాన్ని మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నది మూవీ.
