Adireddy released a video and urges not to come his home: బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆదిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన క్రేజ్ తోటి గత బిగ్ బాస్ సీజన్ లో ఒక నెల రోజుకు 39 లక్షల సంపాదించానని ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఆదిరెడ్డికి ఒక వింత అనుభవం ఎదురైనట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అసలు విషయం ఏమిటంటే ఆదిరెడ్డి తనకొచ్చిన డబ్బుతో తన సొంత ఊరిలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు, అదేవిధంగా విజయవాడలో జావేద్ హబీబ్ ఫ్రాంచైజ్ తీసుకుని సెలూన్ నడుపుతున్నాడు.
Prasanth Varma: ప్రశాంత్ వర్మకి 1000 కోట్ల ఆఫర్.. కానీ షరతులు వర్తిస్తాయి!
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటాడు ఆదిరెడ్డి. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డిని సహాయం కోరే వారి సంఖ్య ఎక్కువ అయి పోయిందని దీంతో తన ఇంటికి కానీ సెలూన్ కి కానీ ఎవరూ రావద్దని చెబుతున్నాడు. నేను సహాయం చేయగలిగినంత వరకు చేయగలను అమెరికా వెళ్లాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి అని వచ్చి సాయం చేయమంటే నేనేం చేయగలను? నేనేమీ ఒక వ్యవస్థను కాదు కదా ఒక ఏరియాలో పెద్ద మనిషిని కూడా కాదు కద అన్నాడు. ఆకలి అంటే భోజనం పెట్టించగలను, పెద్ద పెద్ద కోరికలు కోరితే తీర్చే అంత సంపాదన కానీ టైం కానీ తన దగ్గర లేదని చెప్పుకొచ్చాడు. అందరికీ దయచేసి చెబుతున్నాను మా ఇంటికి కానీ సెలూన్ కి కానీ రావద్దు అంటూ ఆయన విన్నవించుకున్నాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.