NTV Telugu Site icon

Baburaj: సినీ అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. నటుడిపై యువతి కేసు!!!

Baburaj Rape

Baburaj Rape

Rape Case on Baburaj: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీనటుడు బాబురాజ్‌ పిలిచి అత్యాచారం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్‌లోనూ, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ బాబురాజ్‌ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులకు పంపించారు. మహిళ నుంచి ఫోన్‌లో సమాచారం అందుకున్న ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి బాబూరాజ్ రిసార్ట్‌లో మాజీ ఉద్యోగి. కేసు వివరాలను మరుసటి రోజు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందజేస్తామని ఆదిమలి పోలీసులు తెలిపారు.

Balakrishna: తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలయ్య కోటి విరాళం

మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలను దాచిపెట్టినందుకు నటుడు బాబురాజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మలప్పురం ఎస్పీ శశిధరన్ ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కొచ్చిలో ఒక న్యాయవాది బైజు నోయెల్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల తర్వాత 2023లో కొచ్చి డీసీపీగా ఉన్న శశిధరన్‌కు 2019లో జరిగిన నేరం గురించి చెప్పినట్లు ఆ మహిళ పేర్కొంది. ఇప్పుడు మలప్పురం ఎస్పీగా ఉన్న శశిధరన్ కూడా ఫిర్యాదు గురించి తనకు తెలుసని అంగీకరించారు. ఈ క్రమంలో నేరం జరిగినట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆ యువతి ముందుగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడలేదు. హేమ కమిటీ రిపోర్టును బయటపెట్టడం వల్లే ఈ విషయాన్ని బయటపెట్టాలని ఆ మహిళ వివరించింది.

Show comments