Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు. ఆ రేంజ్ క్రేజ్‌తోనే ‘ఆదర్శ కుటుంబం’ అనౌన్స్ అయింది. కానీ కట్ చేస్తే.. రిలీజ్‌కు మరో ఐదారు రోజులు కూడా టైం లేదు, గ్రౌండ్ లెవల్లో చూస్తే మాత్రం అస్సలు జోష్ కనిపించడం లేదు. అసలు ఈ రేంజ్ కాంబో మూవీపై ఇంత సైలెన్స్ ఎందుకనేది ఇప్పుడు ఇండస్ట్రీకే అంతుచిక్కని మిస్టరీగా మారింది. లెక్కప్రకారం గత వారమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, వారం ఆలస్యంగా ఈ శుక్రవారమే (అక్టోబర్ 9) వెండితెరపైకి వస్తుంది. సాధారణంగా వెంకీ మామా లాంటి పెద్ద హీరో సినిమా వస్తుందంటే వారం రోజుల ముందే టికెట్ బుకింగ్స్, ట్రైలర్ రికార్డులు, కౌంట్‌డౌన్ పోస్టర్లతో రచ్చ రంబోలా జరగాలి. కానీ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో దీనికి విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి వచ్చిన ఒకట్రెండు చిట్చాట్లు మినహా, ఆడియన్స్‌ను కదిలించే ఒక్క పవర్ఫుల్ ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాలేదు. నిజం చెప్పాలంటే, ఈ వారం వెంకీ – త్రివిక్రమ్ సినిమా థియేటర్లలోకి వస్తోందన్న కనీస సమాచారం కూడా రెగ్యులర్ సినీ వీక్షకుల్లో చాలామందికి చేరలేదంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ సినిమా వెనుక ఉన్న మరో కీలక వ్యక్తి నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తన బ్యానర్లో ఓ చిన్న బడ్జెట్ మూవీ వస్తేనే.. పదిహేను రోజుల ముందు నుంచే మైకులు పట్టుకుని, బోల్డ్ కామెంట్లతో ప్రెస్ మీట్లను హీటెక్కించే అగ్రెసివ్ ప్రొడ్యూసర్ ఆయన. అలాంటి నాగవంశీ, ఇంతటి భారీ క్రేజీ కాంబో చేతిలో ఉన్నా ప్రమోషన్లలో ఎందుకు యాక్టివ్‌గా లేరనేది పెద్ద ప్రశ్నగా మారింది. మేకర్స్ కావాలనే ఇలాంటి లో-ప్రొఫైల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా, లేక ప్రమోట్ చేయడానికి తగిన బజ్ మెటీరియల్ దొరక్క చేతులెత్తేశారా అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ డెడ్ సైలెన్స్‌కు తోడు సోషల్ మీడియాలో మరో రూమర్ మరింత ఆజ్యం పోస్తోంది. ఇటీవల కోలీవుడ్‌లో హిట్ కొట్టిన ‘బ్లాస్ట్’ మూవీ లైన్‌తో ‘ఆదర్శ కుటుంబం’ నడుస్తుందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఎక్కువగా పెడితే ఆ రీమేక్ పోలికలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే చిత్ర యూనిట్ ప్రమోషన్లను లైట్ తీసుకుంటోందా అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో బలపడుతున్నాయి. రూ.300 కోట్ల హీరో, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కలిసి చేసిన మూవీ ఇలా బజ్ లేకుండా రావడం రిస్క్ అనే చెప్పాలని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సైలెంట్‌గా వచ్చి థియేటర్లలో ‘మల్లీశ్వరి’ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేక ఈ ప్రమోషన్ల లోపం ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందా అన్నది శుక్రవారమే తేలనుంది.
Also Read
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!