Site icon NTV Telugu

Adah Sharma : అద్దె ఇంట్లో అవస్థలు పడుతున్న పూరీ హీరోయిన్..!

Ashasharma

Ashasharma

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అదా శర్మ. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. నటన పరంగా మంచి మార్కులు కోటేసినప్పటికి ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, ఆమె అవకాశాల కోసం సెకండ్ హీరోయిన్ పాత్రల వైపు మళ్ళింది. అలా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.. అయినప్పటికీ

Also Read : Nithin : ‘తమ్ముడు’.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ అని వద్దన్నాను

టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక బాలీవుడ్ బాట పట్టింది.. అక్కడ కూడా అదృష్టం కొంత వరకు తోడైంది. కానీ ‘ది కేరళ స్టోరీ’ అనే చిన్న సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సుమారు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆమెకు నటన పరంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ అయినప్పటికీ, అవకాశాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఆమె అద్దే ఫ్లాట్‌లో నివసిస్తున్నట్టు సమాచారం. అవకాశాలు రనప్పటికి బాలీవుడ్‌లో అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోషూట్స్, ప్రాక్టీస్ వీడియో, డాన్స్ రిహార్సల్స్ వంటి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. కుటుంబ సభ్యులతో గడిపే మధుర క్షణాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా అయిన తన అభిమానులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది.

 

Exit mobile version