Adah Sharma pays rent with her grandmother for the house where Sushant Singh Rajput Lived in: కేరళ స్టోరీలో తన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అదా శర్మ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివసించి ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో నివసిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్ కారణంగా, ఆమె తరచుగా ముఖ్యాంశాలలో ఉంటుంది. ఇటీవల, విలేకరుల సమావేశంలో, నటి తాను ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయలేదని, అద్దెకు నివసిస్తున్నానని స్పష్టం చేసింది. తన అమ్మమ్మతో కలిసి ఉంటున్న తానూ ఈ ఇంటి అద్దెను కూడా చెల్లిస్తున్నట్టు వెల్లడించింది. నేను ఉంటున్న ఇల్లు నాది కాదు, కేరళ స్టోరీ ద్వారా వచ్చిన రూ.300 కోట్లు నావి కాదు కదా అందుకే అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. నాతో పాటు మా అమ్మమ్మ కూడా అద్దె చెల్లించడంలో సహకరిస్తుంది’ అని అదా తెలిపింది. “నేను అక్కడ నివసిస్తున్నాను కాబట్టి నేను అద్దె చెల్లిస్తాను, మా అమ్మమ్మ పని చేయదు, కాబట్టి ఆమె ఆర్థికంగా సహకరించదు, కానీ ఆమె వంట చేస్తుంది అని పేర్కొంది.
Saripodhaa Sanivaaram: రచ్చ రేపేలా ‘సరిపోదా శనివారం’.. ట్రైలర్ అదిరింది బాసూ!!
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న మిస్టర్ లాల్వానీకి చెందినది. సుశాంత్ కూడా అక్కడే అద్దెకు ఉంటున్నాడని అనుకుంటున్నాను. ఇది అతని ఆస్తి కూడా కాదు, కానీ ఇల్లు మిస్టర్ లాల్వానీకి చెందినది. సుశాంత్ కూడా అక్కడ అద్దెకు ఉంటున్నాడని అనుకుంటున్నాను అంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నిజానికి సుశాంత్ సింగ్ మరణం తరువాత ‘ఈ ఫ్లాట్‌కి రావాలంటేనే ప్రజలు భయపడేవారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఈ ఇంటిని దెయ్యం బంగ్లా అని పిలిచేవారు. ఇక్కడకు వచ్చి ఉండేందుకు ఎవరూ సాహసించలేదు. సుశాంత్ సింగ్ మరణానంతరం, అతని ఆత్మ అక్కడ సంచరిస్తోందని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ కారణంగా ప్కొంత మంది అడ్వాన్స్ డబ్బులు చెల్లించి కూడా ఇంట్లో ఉండేందుకు రాని సందర్భాలు ఉన్నాయి. సుశాంత్ సింగ్ మరణానంతరం ఈ ఇంటిని బాలీవుడ్ వాళ్లకు ఇవ్వనని ఇంటి యజమాని గతంలో చెప్పాడు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ ఇంటిని అద్దెకు ఇవ్వనని చెప్పిన ఇంటి యజమాని.. చివరకు నటికి ఈ ఇంటిని అద్దెకు ఇచ్చాడట. నటి ఇంటిని కొంటానని చెప్పారు. ఇప్పుడు నెలకు నాలుగున్నర లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం.