Site icon NTV Telugu

Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్

Ada Sharma

Ada Sharma

హీరోయిన్ అదా శర్మ గురించి పరిచయం అక్కర్లేదు.. తన అందం, అభినయంతో వెలిగి పోతుందనుకున్న ఈ అమ్మడు.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అదా శర్మ.

Also Read : Preity Zinta : ఇండియ‌న్ ఆర్మీకి భారీ విరాళం ఇచ్చిన న‌టి ప్రీతి జింతా..

దీనిపై అదా శర్మ మాట్లాడుతూ ‘నేను సినిమా కుటుంబం నుంచి వచ్చి ఉంటే, నన్ను పరిచయం చేయడానికి ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సినిమా కోసం వేచి ఉండేవారు. అంతే కానీ ఇలా నా కుటుంబం నన్ను హారర్ సినిమా చేయనిచ్చేది కాదు. ఎవరు తమ కెరీర్‌ను దెయ్యం పట్టినట్లు తెరపై కనిపిస్తూ ప్రారంభిస్తారు? చెప్పండి.. నేను ‘1920’ తో ప్రారంభించాను, అందుకు నేను అదృష్టవంతురాలిని. నేను ఏదైనా కొత్తగా ప్రయత్నించి నప్పుడల్లా ప్రేక్షకులు నన్ను అంగీకరించారు, బహుశా అందుకే సినీ నిర్మాతలు కూడా నన్ను విభిన్న పాత్రల్లో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు’ అని తెలిపింది అదా.

Exit mobile version