తమిళ నటి విద్యు రామన్ పెళ్లి పీటలెక్కబోతోంది. అప్పుడే పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. వధువు తన స్నేహితురాళ్లతో కలసి హంగామా చేస్తోంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మంచి హాస్య పాత్రలు పోషించిన విద్యు ఫిట్ నెస్ అండ్ న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ సంజయ్ తో ఏడు అడుగులు వేయబోతోంది. వారిద్దరి నిశ్చితార్థం కొంత కాలం క్రితం నిరాడంబరంగా జరిగింది. అయితే, పెళ్లికి మాత్రం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యు తన ‘బ్రైడ్ స్క్వాడ్’తో కలసి జాలీగా గడుపుతోంది. వెడ్డింగ్ ఈవెంట్ కి ఫుల్ జోష్ తో ప్రిపేర్ అవుతోంది.
Read Also : మహేష్ బాబుకు ఫస్ట్ బెస్ట్ విషెస్
విద్యు రామన్ 2012లో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నీతానే ఎన్ పోన్ వసంతం’ సినిమా ఆమె తొలి చిత్రం. 2012 నుంచీ ఇప్పటిదాకా పలు చిత్రాల్లో నటించిన విద్యు తమిళంలోనే తెలుగు తెరపై తనదైన గుర్తింపు సాధించుకుంది. త్వరలో భర్త ఇంట్లో కుడి కాలుమోపబోతోన్న ఆమె ప్రీ వెడ్డింగ్ హంగామాని గీతాంజలి సెల్వరాఘవన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘బ్రైడ్ స్క్వాడ్’ అంటూ టైటిల్ ఇచ్చిన ఆమె తనతో బాటు మరికొందరు ఫ్రెండ్స్ తో విద్యు రామన్ ఉన్న ఫోటోల్ని నెటిజన్స్ తో పంచుకుంది!
A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan)
A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan)
A post shared by Gitanjali Selvaraghavan (@gitanjaliselvaraghavan)
