Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమె.. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. అసలు పిల్లలు లేకపోయినా ఫర్వాలేదని తామిద్దరం ఒక దశలో నిర్ణయించుకున్నామని, అలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ గురించి తెలియడం తమకు ఊహించని సర్ప్రైజ్గా అనిపించిందని సమంత చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. రీసెంట్ గా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడిన సమంత.. మాతృత్వం గురించి తన మనసులోని భావాలను పంచుకున్నారు. రాజ్ పిల్లలు ఉన్నా లేకపోయినా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని భావించామని ఆమె తెలిపారు. తాము ఆ ఆలోచనకు పూర్తిగా సిద్ధపడిన సమయంలోనే ప్రెగ్నెన్సీ విషయం తెలిసిందని, అందుకే అది తమ ఇద్దరికీ ఒక మ్యాజికల్ సర్ప్రైజ్లా అనిపించిందని సమంత వెల్లడించారు.
ఇక తనకు ప్రెగ్నెన్సీ విషయం ఎప్పుడు తెలిసిందో కూడా సమంత చెప్పారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాలోని థస్సాదియా పాట షూటింగ్ సమయంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని ఆమె వెల్లడించారు. అప్పటికే కొద్దిగా సిక్నెస్, వాంతులు వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ డ్యాన్స్ షూట్లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన వెంటనే షూటింగ్ ఆపేయకుండా పని పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ సమయంలో సమంత విషయంలో దర్శకురాలు నందిని రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, కార్ ఛేజ్ వంటి సీన్లు కూడా ఉండటంతో షూటింగ్ సమయంలో ఆమెకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమంత చెప్పుకొచ్చారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్లో ఆఫీషియల్ గా వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వీరిద్దరూ అంతకుముందు ది ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్ హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టుల కోసం కలిసి పనిచేశారు. 2026 జూన్‌లో ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీని ఆఫీషియల్ గా ప్రకటించారు. త్వరలో తల్లిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తనకు ఎంత ఊహించని పరిణామమో సమంత స్వయంగా చెప్పడంతో ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సమంత.. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్న సమయంలోనే ఈ గుడ్ న్యూస్ రావడం తనకు, రాజ్‌కు ప్రత్యేకమైన అనుభూతి అని ఆమె చెప్పిన మాటలు అభిమానులను కూడా ఎమోషనల్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!