కన్నడ నటి అయిన రమ్య నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అభిమన్యు సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రమ్య. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. ప్రస్తుతం రమ్య సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో రమ్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.
అతడిని అరెస్టు చేయాలని ఆమె బెంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్ 10) విడుదలైంది. నిన్న ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేశాడు. దీంతో రమ్య ప్రీతమ్ ప్రీన్స్ తరచూ తనని ట్రోల్ చేస్తున్నాడని, అతడి అరెస్టు చేయాలని కోరుతూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతమ్ ప్రిన్స్ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా విచారిస్తున్నారు.
