నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు అజయ్ దేవగన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆమె లేడీ లీడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ప్రీత్ తన రీల్ అలాగే రియల్ జీవితం గురించి మాత్రమే కాకుండా దీపావళి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ దీపావళికి సంబంధించి మీకు ఏదైనా జ్ఞాపకం ఉంటే, అది చెబుతారా? అని అడిగితే తాను ఈశాన్య రాష్ట్రాల్లో న్నప్పుడు, దీపావళి సమయంలో ప్రజలు తమ ఇళ్ల వెలుపల అరటి చెట్లను నాటేవారు, దానిపై దీపాలు వెలిగించేవారు. అప్పట్లో మేం కూడా ఇంటి బయట అరటిచెట్టు మొక్కను నాటాం.
Actress Kasturi : వివాదస్పద వ్యాఖ్యలపై ‘నటి కస్తూరి’ వివరణ
ఆ ఆకులకు కర్రలు అంటించి కాల్చేవారు. అక్కడ ప్రజలు దీపావళి సందర్భంగా బాంబూ డ్యాన్స్ మొదలైనవి కూడా చేసేవారు. ఇదంతా నాకు భిన్నంగా ఉండేది. అలాగే నాకు దీపావళి అంటే చాలా ఇష్టం, కానీ క్రాకర్స్ అంటే ఇష్టం ఉండదు. నిజానికి ఐదో తరగతి నుంచే క్రాకర్స్ పేల్చడం మానేశాను. అలా చేయడానికి ఒక మరపురాని విషయం జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఒక దీపావళి రోజున మా నాన్న ‘ఈ 500 రూపాయల నోటు తీసుకుని కాల్చండి’ అని చెప్పారు. నేను పాపా, ఇలా ఎందుకు అన్నావు? అని అడిగితే ఆయన అప్పుడు ‘నువ్వు అదే పని చేస్తున్నావు. ఈ డబ్బుతో పటాకులు కొని కాల్చేస్తున్నారు. ఈ డబ్బుతో చాక్లెట్లు కొని పేదలకు ఇస్తే మంచిది అని అన్నారు. అప్పటికి నా వయసు 9-10 ఏళ్లు. ఆ మాటలు నచ్చడంతో తండ్రితో కలిసి వెళ్లి మిఠాయిలు తెచ్చి నిరాశ్రయులకు పంచానని అన్నారు.. అందులో నాకు లభించిన ఆనందం పూర్తిగా వేరు. అప్పటి నుంచి నేను ఎప్పుడూ క్రాకర్స్ పేల్చలేదు అని ఆమె చెప్పుకొచ్చింది.