Tollywood : ‘రెగ్యులర్’ ముద్ర కేవలం మహిళలకేనా? .. రజిత ఆవేదన కరెక్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఒక లోతైన చర్చకు దారి తీశాయి. డైరెక్టర్లు కొత్తదనం పేరుతో తెలుగు నటీమణులను పక్కన పెడుతున్నారని, మగ ఆర్టిస్టులకు లేని ‘రెగ్యులర్’ (బోర్ కొట్టడం) అనే ముద్ర కేవలం ఫీమేల్ ఆర్టిస్టులకే ఎందుకు వేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన రజిత లాంటి నటి, ఒక చిన్న పాత్ర కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడంపై తన ఆవేదన వ్యక్తం చేయడం తెలుగు పరిశ్రమలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను కళ్లకు కట్టింది. దర్శకులు పైకి చెబుతున్నట్లుగా సీనియర్ నటీమణులను చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడం అనేది కేవలం ఒక సాకు మాత్రమే. దీని వెనుక అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతి సినిమా వ్యాపార దృక్పథంతోనే ముడిపడి ఉంది. ఒకప్పటిలాగా కేవలం తెలుగు రాష్ట్రాలకే మార్కెట్ పరిమితం కాలేదు. డబ్బింగ్, శాటిలైట్, ఓటీటీ, పాన్ ఇండియా.. ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి నదియా, ఖుష్బు లాంటి వారినో లేదా బాలీవుడ్ నుంచి ఇంకెవరినో తల్లి, అత్త పాత్రల కోసం తీసుకొస్తే ఆ సినిమాకు ఆటోమేటిక్‌గా ఒక ‘గ్రాండ్ లుక్’, ‘పాన్ ఇండియా అప్పీల్’ వస్తుందని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఈ ముఖాలు పరిచయం కావడం వల్ల డబ్బింగ్ బిజినెస్ సులువు అవుతుందనేది వారి అసలు లెక్క.
అయితే ఇక్కడ మేకర్స్ విస్మరిస్తున్న అతిపెద్ద లాజిక్ ఒకటి ఉంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ, బ్రహ్మాజీ లాంటి మగ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నా ఎవరికీ ‘రెగ్యులర్’ అనిపించరు. వాళ్ళు లేకుండా సినిమాలు తీయలేరు. కానీ అచ్చమైన తెలుగు భాష మాట్లాడే, మన నేటివిటీకి సరిగ్గా సరిపోయే స్థానిక నటీమణులు రెండు మూడు సినిమాలు చేయగానే ‘రొటీన్’ అయిపోతారా? పరభాషా నటులకు లక్షలు, కోట్లు పోసి వాళ్ళకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోలేని పాత్రలు ఇచ్చే మేకర్స్.. కేవలం ‘బి’ కేటగిరీ పాత్రల కోసం కూడా ఎక్కడినుంచో కొత్త వాళ్లను దిగుమతి చేసుకోవడం స్థానిక టాలెంట్‌ను అవమానించడమే. మార్కెట్ పరిధి పెంచుకోవడం, బిజినెస్ లెక్కలు చూసుకోవడం సినిమా పరిశ్రమలో తప్పు కాదు. కానీ ఆ వ్యాపారపు లెక్కల్లో పడి, అద్భుతమైన నైపుణ్యం ఉన్న మన స్థానిక సీనియర్ ఆర్టిస్టులను “మీరు రెగ్యులర్ అయిపోయారు” అని పక్కన పెట్టడం కచ్చితంగా విచారకరం. రజిత అడిగిన ఈ ప్రశ్న కేవలం ఆమె ఆవేదన మాత్రమే కాదు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది తెలుగు నటీమణుల గొంతుక. ఈ విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read
- Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
- Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
- Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
- Ramayana: ఆస్కార్ రేసులో 'రామాయణ: పార్ట్ 1'.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
తాజావార్తలు
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్‌కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
-
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!