NTV Telugu Site icon

Pragya Nagra : లీక్ వీడియోలపై స్పందించిన నటి ప్రగ్యా

Pragyanagra

Pragyanagra

తెలుగులో ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ అయిన లగ్గం సినిమాలో నటించింది ప్రగ్యా. ఈ సినిమా ఆమెకు అంతగాపేరు రాకున్నా ఓ లీక్ వీడియోతో ఈ హర్యానా ముద్దుగుమ్మ పేరు గత కొద్దీ రోజలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రగ్యా కు చెందిన ప్రవైట్ వీడియో అంటూ నెట్టింట కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. తన పేరిట సోషల్ మీడియా మద్యమాల్లో తిరుగుతున్న వీడియో పట్ల స్పందించింది ప్రగ్యా.

తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘‘ఆ వీడియోలు ఎప్పటికీ నిజం కాదు. ఈ పరిణామం ఓ పీడ కలయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాల్ని బాగు చేసేందుకు సాయం చేయాలి. అంతే కానీ, మన జీవితాల్ని ఇలా నాశనం చేయకూడదు. కొందరు నీచపు బుద్ధి కలిగిన వ్యక్తులు ఏఐ సాయంతో ఓ నా ఫెస్ పెట్టి డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చెడు ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ అమ్మాయికి ఇలా జరగకూడదని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఇలాంటి విషయలలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని సైబరాబాద్‌ పోలీస్‌, సైబర్‌ దోస్త్‌, మహారాష్ట్ర సైబర్‌ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్ చేసింది ప్రగ్యా. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ డీప్ ఫేక్ చేసిన వారిని  కనిపెట్టి, వీరికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రగ్యాకు మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments