NTV Telugu Site icon

తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి

Actress Mandira Bedi 's husband Raj Kaushal passed away

ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, నిర్మాత, డైరెక్టర్ రాజ్ కౌశల్ కన్నుమూశారు. 49 ఏళ్ళ వయసున్న ఆయన ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 90ల చివర్లో, 2000 మధ్యలో దర్శకుడుగా, నిర్మాతగా స్టంట్ డైరెక్టర్ గా చురుకుగా పలు సినిమాలను తెరకెక్కించారు రాజ్ కౌశల్.

Read Also : 5 నిమిషాల్లో “క్రిష్-4” కథ చెప్పేసిన నెటిజన్… హృతిక్ రియాక్షన్ ఇదీ…!!

ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ వ్యాఖ్యాత మందిరా బేడీని 14 ఫిబ్రవరి 1999న రాజ్ కౌషల్‌ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 19 జూన్ 2011న వీర్ అనే అబ్బాయి పుట్టాడు. 2020 అక్టోబర్‌లో మందిర, రాజ్ దంపతులు 4 సంవత్సరాల అమ్మాయిని దత్తత తీసుకుని, ఆమెకు తారా బేడి కౌషల్ అని పేరు పెట్టారు. గతకొంతకాలం నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఈరోజు ఇలా అనుకోకుండా గుండెపోటు రావడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజ్ కౌశల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.