నటి మధుబాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హేమామాలిని మేనకోడలైన ఆమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అల్లరి ప్రియుడు అనే సినిమాతో హీరోయిన్‌గా మారిన ఆమె తర్వాత ఆవేశం, పుట్టినిల్లు మెట్టినిల్లు, చిలకకొట్టుడు, గణేష్ వంటి సినిమస్‌లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఆమె సినీ పరిశ్రమకు దూరమైంది. మళ్లీ అంతకుముందు, ఆ తర్వాత ఆయన సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతానికి కన్నప్ప సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది.
Samantha : ఆ పోస్టుకు లైక్ కొట్టిన సమంత.. మళ్లీ మొదలైన రచ్చ
తాజాగా ఆమె ఎన్‌టీవీతో ప్రత్యేకంగా సంభాషించింది. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలోనే తాను చిరంజీవిని కలిశానని ఆమె చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో చిరంజీవిని కలిశానని, ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో అప్పటికే చిరంజీవి మెగాస్టార్ అని, తాను కొత్తగా వచ్చానని అన్నారు. అయితే తాను కలవడానికి వెళ్లినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుర్చీలోంచి లేచి నిలబడి తనను కూర్చోమని అడిగారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ మధ్యనే తాను కలిసినప్పుడు అప్పుడు ఎలా అయితే తనను రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారని చెప్పింది. చిరంజీవి అంటేనే గౌరవానికి ప్రతీక అంటూ ఆమె కామెంట్ చేశారు.
