NTV Telugu Site icon

కావాలనే నటితో కౌగిలింత సీన్‌కు 17 టేకులు.. సంచలన విషయాలు వెలుగులోకి !

Malayalam Hugging

Malayalam Hugging

Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీ ద్వేషం ప్రబలిందని నివేదికలో పేర్కొన్నారు. పలువురు ప్రముఖ నటీమణులు సైతం లైంగిక వేధింపులకు అంగీకరించాలని బలవంతం చేశారని కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. హేమ కమిటీ నివేదికలోని 55 – 56 పేజీలు మలయాళ సినిమాల్లో లైంగిక నేరాలను గురించి ప్రస్తావించారు. మలయాళ సినిమాల్లో లైంగిక వేధింపులు ఎక్కువ అని సినిమాలో ఛాన్స్ రావాలంటే సర్దుకుపోవాల్సిన వాతావరణం నెలకొందని కమిటీ తేల్చింది.

Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?

ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించడం లేదు. ఫిర్యాదు చేస్తే కుటుంబానికి బెదిరింపులు వస్తాయని భయపడుతున్నట్లు పేర్కొన్నారు. శృంగార అవసరాలకు అనుగుణంగా లేని వారిని చిత్రసీమలో ఒక ముద్రవేసి తొలగిస్తారని, దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వారిని కూడా సినిమాల నుంచి తొలగిస్తారని నివేదికలో పేర్కొన్నారు. మలయాళ సినిమాని ఓ మాఫియా గ్యాంగ్ కంట్రోల్ చేస్తుందని, సినిమాలో నటించేందుకు వస్తే.. తమకు లొంగకపోతే చిత్రహింసలకు గురిచేస్తారని అంటున్నారు. లైంగిక వేధింపులకు గురైన ఓ నటిని కౌగిలించుకునే సన్నివేశంలో ఓ హీరో ఆ సన్నివేశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కావాలనే 17 టేక్స్ తీసుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడు నటుడ్ని తిట్టలేదని చెప్పడంతో తాము షాక్ అయ్యామని హేమ కమిటీ నివేదికలో నమోదు చేసింది. ‘లైంగికంగా లొంగిపోయే వ్యక్తులకు మాత్రమే మంచి ఆహారం లభిస్తుంది, నటీమణులు నగ్నంగా నటించాలని కూడా పైస్థాయి నుంచి ఒత్తిడి వస్తోందని అన్నారు. దర్శకులు, నిర్మాతలు అడుగుతున్నారని, అలా చేయమని ఒత్తిడి చేస్తున్నారనే షాకింగ్ సమాచారం కూడా ఉందని హేమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ రిపోర్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.