Site icon NTV Telugu

Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..

Laya

Laya

సీనియర్ హీరోయిన్‌‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నావారిలో లయ ఒకరు. తక్కువ సినిమాలే చేసినప్పటికి దాదాపు అందరు హీరోలతో జత కట్టింది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లయ.. చాలా గ్యాప్ తర్వాత ‘తమ్మడు’ మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది.

Also Read : Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా లయ మాట్లాడుతూ.. ‘నేను సినిమా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుని 20 ఏళ్లవుతోంది, ‘తమ్ముడు’ మూవీతో తిరిగి సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది, సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతోంది. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు, భయాలు ఉండేవి. కానీ ఈ సినిమా టీం నాలోని ఆ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించారు. ఇండస్ట్రీకి తిరిగి రావడానికి నా భర్త, పిల్లల సహకారం కూడా ఎంతో ఉంది. ఇప్పటిదాకా నేను చేయాలనుకున్న పాత్రలు, సినిమాలు చేసే అవకాశం మరోసారి టాలీవుడ్ కల్పించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version