NTV Telugu Site icon

Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు

Kasturi

Kasturi

తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఇటీవల కస్తూరి తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి పై చెన్నై మరియు  మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసారు.

Also Read : suriya : తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ‘కంగువా’ రిలీజ్..

ఈ వివాదం ఒకవైపు జరుగుతుండగానే ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ ఉద్యోగులపై నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమను కించ పరిచేలా మాట్లాడి తమ మనో భావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఈ నేపథ్యంలో ఆమెపై చెన్నైలోని పలు స్టేషన్స్ లో కేసులు నమోదు అయ్యయి. కస్తూరిపై  నమోదయిన కేసుల్లో ఆమెను విచారించేందుకు చెన్నై పోలీసులు సమన్లు ​​జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందని విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  కస్తూరి తమిళనాడు విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Show comments