Actress Kasturi : వివాదస్పద వ్యాఖ్యలపై ‘నటి కస్తూరి’ వివరణ
- తెలుగు వారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
- కస్తూరిపై మండిపడుతున్న తెలుగు సంఘాలు
- తాను అల అనలేదని వీడియో రిలీజ్ చేసిన కస్తూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో ఆదివారం జరిగిన ఓ సభలో బీజేపీ మహిళా నాయకురాలు నటి కస్తూరి తెలుగు వారిపై ‘ రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ‘ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది’ అని అన్నారు.
Also Read : Vijay Sethupathi : ఫాన్సీ రేటు ‘విడుదల – 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్..
Also Read
కస్తూరి వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడ్డాయి. తక్షణమే తెలుగు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి. ఈ వివాదం కాస్త ముదురుతుండడంతో తన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇస్తూ ” తెలుగుప్రజల గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. డీఎంకే వాళ్లు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై నెగిటివిటీ తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో అభిమానం చూపుతున్నారు. నన్ను వారు ఎంతగానో ఆదరించారు. ఆ ప్రేమను దూరం చేసేందుకు డీఎంకే వాళ్లు నాపై కుట్ర చేస్తున్నారు” అని అన్నారు.
Yesterday I exposed the double standards of fraud dravidia migrant imposters who play divisive hate politics among tamils.
Today DMK ecosystem trying to bully me by running a smear campaign about my telugu loyalty. They are trending FAKE NEWS that i spoke against telugus.— Kasturi (@KasthuriShankar) November 4, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..